Page Loader
NTR Jayanthi: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ఘన నివాళి
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ఘన నివాళి

NTR Jayanthi: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ఘన నివాళి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

నేడు నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు ఘన నివాళులర్పించారు. నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే కారులో అక్కడికి చేరుకుని, తాత సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి మర్యాదలు నిర్వహించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఇక నందమూరి కుటుంబంలోని మిగతా సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులర్పించనున్నారు.

Details

ఘాట్ వద్దకు చేరుకున్న అభిమానులు

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘాట్ వద్దకు తరలివచ్చారు. భారీగా కూడగిన్న ప్రజానీకాన్ని నియంత్రించేందుకు పోలీసులు అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ జయంతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 28ను ప్రతేదాడి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని పేర్కొంటూ జీవోను జారీ చేసింది. దీనివల్ల ఎన్టీఆర్ సేవలకు రాష్ట్ర ప్రభుత్వంగా గౌరవనివాళి అర్పించడమే కాక, ప్రజల్లో ఆయన స్ఫూర్తిని పరిపోషించే దిశగా అడుగు పడినట్లయింది.