NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Trishna Ray: మిస్ టీన్ యూనివర్స్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్న తృష్ణా రే 
    తదుపరి వార్తా కథనం
    Trishna Ray: మిస్ టీన్ యూనివర్స్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్న తృష్ణా రే 
    మిస్ టీన్ యూనివర్స్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్న తృష్ణా రే

    Trishna Ray: మిస్ టీన్ యూనివర్స్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్న తృష్ణా రే 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 12, 2024
    04:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌కు చెందిన తృష్ణా రే ఈ ఏడాది 'మిస్‌ టీన్ యూనివర్స్' కిరీటాన్ని దక్కించుకున్నారు.

    దక్షిణాఫ్రికాలోని క్లింబరీ వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, కెన్యా, పోర్చుగల్‌, నమీబియా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు చెందిన అనేక అందగత్తెలు పాల్గొన్నారు.

    వారి మధ్య 19 ఏళ్ల తృష్ణా రే తన ప్రత్యేకతతో ముందుకు సాగి, మిస్‌ టీన్‌ యూనివర్స్‌ కిరీటాన్ని గెలుచుకున్నారు.

    పెరూకు చెందిన అన్నే థోర్సెన్‌, నమీబియాకు చెందిన ప్రెషియస్‌ ఆండ్రీ వరుసగా రెండో, మూడో స్థానాలను సాధించారు.

    ఒడిశా రాష్ట్రానికి చెందిన తృష్ణా రే, కల్నల్‌ దిలీప్‌ కుమార్‌ రే, రాజశ్రీ రేల కుమార్తె.

    వివరాలు 

    దేశానికి గర్వకారణం 

    ప్రస్తుతం తృష్ణా భువనేశ్వర్‌లో కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతున్నారు.

    గత ఏప్రిల్‌లో జరిగిన మిస్‌ టీన్‌ యానివర్స్‌ ఇండియా పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు, తద్వారా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఘన విజయం సాధించారు.

    ఈ పోటీలకు సంబంధించిన వీడియోను నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా, పలువురు నెటిజన్‌లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    కేఐఐటీ ఇన్‌స్టిట్యూట్ కూడా తమ అధికారిక వెబ్‌సైట్‌లో తృష్ణా విజయాన్ని ప్రశంసిస్తూ, ఇది దేశానికి గర్వకారణమని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా

    తాజా

    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం

    ఒడిశా

    Snake Bit : ఈ ప్రభుద్ధుడు మనిషే కాదు.. డబ్బు కోసం భార్య,బిడ్డలను పాముకాటుతో చంపాడు భారతదేశం
    VK Pandian: ఒడిశా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యిన వీకే పాండియన్‌ భారతదేశం
    IT Raids : జార్ఖండ్, ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసంలో సోదాలు.. రూ.100కోట్లకుపైగా నగదు సీజ్  భారతదేశం
    Dheeraj Sahu IT raids: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నల్లధనం కొండ.. నాలుగు రోజులైనా తేలని లెక్క  ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025