Page Loader
మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు..
భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు బయలుదేరిన భర్త

మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు..

వ్రాసిన వారు Stalin
Feb 09, 2023
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అంబులెన్స్‌కు డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భూజలపై మోసుకుంటూ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నఇంటికి బయలుదేరాడో ఓ భర్త. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన సాములు పాంగి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఓ ఆసుపత్రిలో చేర్పించాడు. అప్పటికే ఆమెపై ఆశలు వదులుకోవాలని డాక్టర్లు పాంగికి చెప్పారు. కొన ఊపిరితో ఉన్న తన భార్యను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరికి తీసుకెళ్లడానికి పాంగి ఆటోను మాట్లాడుకున్నాడు. ఆటోలో కొద్ది దూరం వెళ్లగానే ఆమె మృతి చెందింది. దీంతో ఆ ఆటోడ్రైవర్ మానవత్వం మరిచి విజయనగరం రూరల్‌ సర్కిల్‌ పరిధిలో మృతదేహాన్ని దింపేశాడు.

ఆంధ్రప్రదేశ్

విజయనగరం రూరల్‌ పోలీసుల మానవత్వం

మరో వాహనం మాట్లాడుకునేందుకు డబ్బులు లేక, భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటి వైపు నడవడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టీవీ తిరుపతిరావుకు చెప్పారు. అనంతరం పోలీసులు సాములు పాంగి వద్దకు చేరుకొని ఏమైందని ఆరా తీశారు. భాష సమస్య వల్ల పాంగి ఏం మాట్లాడుతున్నాడో తెలియక విజయనగరం పోలీసులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత అసలు విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పాంగి భార్య మృత దేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. పోలీసుల సహాయానికి పాంగి కృతజ్ఞతలు తెలిపాడు. సకాలంలో స్పందించినందుకు స్థానికులు పోలీసులను అభినందించారు.