MEA: ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. తీవ్రంగా స్పందించిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
ఒమన్ తీరానికి సమీపంలో భారత జెండా కలిగిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన క్షిపణి దాడిపై కేంద్ర విదేశాంగ శాఖ (MEA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనను "అంగీకరించలేనిది" అంటూ ఖండించింది. బుధవారం జరిగిన ఈ దాడిపై గురువారం స్పందించిన విదేశాంగ శాఖ, వరుసగా వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. సముద్ర మార్గాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకలు,సాధారణ సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరమని పేర్కొంది. ఈ ఘటనలో నౌకలో ఉన్న భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ వెల్లడించారు. వారిని రక్షించడంలో సహకరించిన ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది.
వివరాలు
హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు
అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణా, వాణిజ్యానికి ఆటంకం కలిగించే చర్యలు నిలిపివేయాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ దాడిని ఎవరు నిర్వహించారన్న విషయంపై విదేశాంగశాఖ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ విరమణపై చర్చలు సరిగా సాగకపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత మరింత పెరిగినట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.