Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ రాజస్థానీ మల్టీ కలర్ తలపాగా
భారతదేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుగుపుకుంటోంది. గత పదేళ్లు ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ధరిస్తున్న తలపాగా హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సారి కూడా నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసే ముందు ప్రధాని మోదీ మల్టీ కలర్ తలపాగా అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని మోదీ రాజస్థాన్‌కు చెందిన ప్రత్యేక బంధిని డిజైన్ తలపాగాను ధరించారు. ఈ తలపాగాలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, వంటి అనేక రంగులు ఉన్నాయి. అలాగే తలపాగాకు సరిపోయేలా ఆఫ్-వైట్ కుర్తా, తెలుపు ప్యాంటు, పాకెట్ స్క్వేర్‌తో కూడిన జాకెట్‌ను ధరించారు.
2014 నుంచి సంప్రదాయంగా వస్తున్న తలపాగా
ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ రంగురంగుల తలపాగాలను 2014 నుంచి ధరించడం సంప్రదాయంగా వస్తోంది. 2022లో మోదీ జాతీయ జెండా రంగులకు సరిపోయే తలపాగాను ధరించారు. కుంకుమ, ఆకుపచ్చ రంగులతో కూడిన తెల్లటి తలపాగాను మోదీ ధరించారు. 2021లో తలపాగా కుంకుమ రంగులో ఉండే తలపాగాతో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2020లో కుంకుమపువ్వు మరియు క్రీమ్-రంగు తలపాగాతో ఆకట్టుకున్నారు. 2024లో ఎన్నికలకు వెళ్లే ముందు ఈరోజు మోదీ చేసిన ప్రసంగం చాలా కీలకంగా మారనుంది.