Page Loader
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 రద్దుపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 రద్దుపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 రద్దుపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

వ్రాసిన వారు Stalin
Sep 26, 2023
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌ విచారణ బుధవారానికి వాయిదా పడింది. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించారు. నోటిఫికేషన్‌లో చెప్పిన విధంగా బయోమెట్రిక్స్ విధానాన్ని అమలు చేయడంలో సమస్య ఏమిటి? మీరు ఇచ్చిన నోటిఫికేషన్‌ను మీరే అనుసరించకపోతే ఎలా? ఒకసారి పరీక్ష రద్దు అయిన తర్వాత జాగ్రత్తగా ఉండాలని తెలియదా? అని హైకోర్టు ప్రశ్నించింది. నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీపై ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇప్పుడు అభ్యర్థుల భవిష్యత్తు, టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ట ప్రశ్నార్థకంగా మారిందని విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేయగా, ఆ ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీఎస్‌పీఎస్‌సీపై హైకోర్టు ప్రశ్నల వర్షం