Isro Somnath: ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్.. ఆదిత్య L-1 ప్రయోగం రోజునే నిర్దారణ
ఈ వార్తాకథనం ఏంటి
ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయ్యియింది. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా వెల్లడించారు.
సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రారంభించిన రోజున రొటీన్ చెకప్‌లో భాగంగా తనకు క్యాన్సర్ సోకినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
తార్మాక్ మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
చంద్రయాన్-3 మిషన్ ప్రయోగ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు ఆయన వివరించారు.
ఆ తర్వాత తాను ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా.. ఆదిత్య ఎల్-1 ప్రయోగం రోజున వచ్చిన రిపోర్ట్స్‌లో తన శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నట్లు తెలిసిందన్నారు.
ఇస్రో
చెన్నైలో చికిత్స
ఈ వార్తతో తానే కాకుండా, తన కుటుంబ సభ్యులు, సహోద్యోగులకు కూడా షాక్‌లో మునిగిపోయారని సోమ్ నాథ్ అన్నారు.
భారతదేశపు మొదటి సన్ మిషన్ ఆదిత్య L-1 తన ప్రయాణాన్ని 2 సెప్టెంబర్ 2023న ప్రారంభించింది. అదే రోజు సోమనాథ్ రొటీన్ చెకప్ కోసం వెళ్లారు.
ఈ సమయంలో అతని కడుపులో క్యాన్సర్ కణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిన తర్వాత, పూర్తిస్థాయి నిర్ధారణ కోసం సోమ్ నాథ్ చెన్నైకి వెళ్లారు. అక్కడ కూడా అతనికి క్యాన్సర్ ఉన్నట్లు తెలిపింది.
ఆ తర్వాత అక్కడే ఆయన కీమో థెరపీ చేయించుకొని, ఆపరేషన్ చేయించుకున్నారు.
ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని ఆయన చెప్పారు. అయితే నిరంతరం చెకప్‌లు, స్కాన్‌లు చేయించుకుంటున్నట్లు వెల్లడించారు.