
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
అయితే చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మానసం బుధవారం విచారించనుంది.
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై రేపు విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది.
ఇదిలా ఉంటే, చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నట్లు సమాచారం అందడంతో ఇంచార్జి న్యాయమూర్తి పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్
సుప్రీంకోర్టు లో రేపటి విచారణ జాబితా వెల్లడి
— YuvaGalam (@sreenath1089) September 26, 2023
రేపు చంద్రబాబు పిటీషన్ పై సుప్రీంలో విచారణ
ప్రస్తావన అవసరం లేకుండానే రేపటికి విచారణ తేదీ ని ఖరారు చేసిన సిజెఐ🙏#ITRally #BoycottTFI #BoycottTollyWood #FalseCasesAgainstNaidu #IAmWithCBN @JaiTDP @iTDP_Official #WeStandWithCBN