Page Loader
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది,జవాన్ మృతి
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది,జవాన్ మృతి

జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది,జవాన్ మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 13, 2023
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఒక ఉగ్రవాది, ఆర్మీ జవాను ఒకరు మరణించగా, ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైనికుడిని కాపాడి ఆరేళ్ల భారత ఆర్మీ జాగిలం కెంట్ మరణించింది. నార్ల గ్రామంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగిందని జమ్మూ జోన్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ముఖేష్‌ సింగ్‌ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌ లో "ఒక ఉగ్రవాది,ఒక ఆర్మీ సైనికుడు మరణించగా, ముగ్గురు భద్రతా సిబ్బంది - ఇద్దరు ఆర్మీ జవాన్లు, ఒక ప్రత్యేక పోలీసు అధికారి కాల్పుల్లో గాయపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సైనికుడిని కాపాడి ఆరేళ్ల భారత ఆర్మీ జాగిలం కెంట్ మరణం