కునో నేషనల్ పార్కులో నేలరాలిన సూరజ్.. 4 నెలల్లో ఎనిమిది చీతాల మరణాలు
గత కొద్ది నెలలుగా భారతదేశంలో చిరుత పులులు ఒక దాని వెంట మరోటి మరణిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో తాజాగా మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం ఉదయం ఆఫ్రికన్ మగ చీతా సూరజ్ ను అటవీ అధికారులు నిర్జీవ స్థితిలో గుర్తించారు. ఈ నేపథ్యంలో గత 4 నెలల్లో ప్రాణాలు కోల్పోయిన చిరుతల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇటీవలే తేజస్ అనే మగ చిరుత మంగళవారం చనిపోయింది. ఓ ఆడ చిరుతతో జరిగిన ఘర్షణలో తేజస్‌కు తీవ్రమైన గాయాలతో మరణించిందని పోస్ట్‌మార్టం నివేదిక బహిర్గతం చేసింది. మే 25న 2 కూనలు వడగాలులకు మరణించాయి. దక్ష, ఉదయ్, సాషా చిరుతలు వివిధ అనారోగ్యాల బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి.