
Navy helicopter crashes: కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలికాప్టర్.. ఒకరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కొచ్చిలోని నావికా దళ ఎయిర్‌స్టేషన్‌లోని ఐఎన్‌ఎస్ గరుడ రన్‌వేపై చేతక్ హెలికాప్టర్ శనివారం కూలిపోయింది.
నేవల్ ఎయిర్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ టాక్సీ తనిఖీల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఒక గ్రౌండ్ సిబ్బంది యోగేంద్ర సింగ్ మరణించినట్లు నేవీ ప్రతినిధి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించినట్లు తెలిపారు.
భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, సిబ్బంది యోగేంద్ర సింగ్ మృతికి సంతాపం తెలిపారు.
మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సాధారణ శిక్షణ సమయంలో చేతక్ హెలికాప్టర్ కుప్పకూలినట్లు సమాచారం.
సదరన్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయం పక్కనే ఐఎన్ఎస్ గరుడ నౌకాదళ వైమానిక శిక్షణా కేంద్రం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తనిఖీల సమయంలో ప్రమాదం
Indian Navy's #Chetak helicopter crashes during training checks at INS Garuda runway#IndianNavy #ChetakHelicopter #Rworldhttps://t.co/dkM3B7NVCK
— Republic (@republic) November 4, 2023