
ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్‌లో ఆన్‌లైన్ విధానం ద్వారా అడ్మిషన్లను చేపట్టనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు.
ఆన్‌లైన్ ప్రవేశాలను 2024-25 విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇంటర్ అడ్మిషన్లలో అవకతవకలను అరికట్టేందుకు ఆన్ లైన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.
విద్యాశాఖ
జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ క్లాసులు
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. తరగతుల ప్రారంభంపై తర్వలోనే అవసరమైన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేయనుంది.
అలాగే ప్రవేటు కాలేజీల విషయంలో కూడా ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అగ్నిమాపక ఎన్ఓసీల విషయంలో ఇంటర్ బోర్డు కఠినంగా వ్యవహరించనుంది.
కొన్ని ప్రైవేటు కాలేజీలకు ఇచ్చే అనుబంధ గుర్తింపును ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నట్లు అధికారులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే చెప్పారు.