తదుపరి వార్తా కథనం

Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం.. చట్టంగా మారిన ఆన్‌లైన్ నియంత్రణ బిల్లు
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 22, 2025
07:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
"ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహం,నియంత్రణ బిల్లు"కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ఆగస్టు 21న రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం డబ్బుతో ఆడించే అన్ని ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను పూర్తిగా నిషేధించారు. వీటిని నడిపే వారిపై మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే గరిష్టంగా రూ.1 కోటి జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ గేమింగ్ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లకు సంబంధించిన ప్రకటనలు చేయడానికీ అనుమతి లేదు. ప్రకటనల ద్వారా ప్రచారం చేసినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం
The Promotion and Regulation of Online Gaming Bill, 2025, receives President Droupadi Murmu's assent pic.twitter.com/cGFxdCBb7G
— ANI (@ANI) August 22, 2025