LOADING...
Operation Ajay: 286 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న 5వ విమానం
286 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న 5వ విమానం

Operation Ajay: 286 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న 5వ విమానం

వ్రాసిన వారు Stalin
Oct 18, 2023
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

'ఆపరేషన్ అజయ్‌'లో భాగంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు విమానాల్లో భారతీయులను తరలించారు. తాజాగా 18మంది నేపాల్ పౌరులతో సహా 286 మంది భారతీయులతో కూడిన విమానం దిల్లీకి చేరుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నడుస్తున్న నేపథ్యంలో భారత్ 'ఆపరేషన్ అజయ్‌'ను చేపట్టింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ నుంచి భారతీయులను దిల్లీకి తరలిస్తోంది. ఈ నేపథ్యంలో 5వ విమానం దిల్లీకి చేరుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా తెలిపారు. సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ విమానాశ్రయంలో ప్రయాణీకులకు స్వాగతం పలికిన చిత్రాలను కూడా ఆయన పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అరిందమ్ బాగ్చి  ట్వీట్