
Operation Ajay: 274 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి దిల్లీకి చేరుకున్న నాలుగో విమానం
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్'లో కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
ఇప్పటికే మూడు విమానాల్లో ఇజ్రాయెల్ నుంచి భారతీయులను దిల్లీకి కేంద్రం తీసుకొచ్చింది. ఆదివారం 274 మంది భారతీయులతో కూడిన నాలుగో విమానం దిల్లీకి చేరుకుంది.
ఈ విమానం శనివారం రాత్రి 11.45 గంటలకు ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది.
అంతకుముందు 197 మంది భారతీయ పౌరులతో కూడిన మూడో ఇజ్రాయెల్‌లో శనివారం సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరింది. ఒకే రోజు రెండు విమానాలు అక్కడి నుంచి దిల్లీకి బయలుదేరాయి.
ఆపరేషన్ అజయ్‌లో భాగంగా కేంద్రం ఇప్పటివరకు 918 మంది భారతీయులను ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా తరలించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ట్వీట్
#OperationAjay
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 14, 2023
2nd flight of the day departs from Tel Aviv carrying 274 passengers. pic.twitter.com/UeRQGhamuN