Operation Sindoor Link: ఆపరేషన్ సిందూర్ తర్వాత ఐఎస్‌ఐతో లింక్.. వాట్సప్ ద్వారా రహస్య సమాచారం లీక్..!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న గూఢచర్య నెట్‌వర్క్‌పై పోలీసులు తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు కొనసాగిస్తున్న పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అతడిని విచారించగా షాక్‌కు గురిచేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రఫుల్లకుమార్ మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లా సాధువాలి మిలిటరీ జోన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పంజాబ్‌కు చెందిన ప్రకాశ్ సింగ్ అలియాస్ బాదల్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి మొబైల్ ఫోన్ పరిశీలనలో పాకిస్థాన్‌కు చెందిన పలువురు నెంబర్లతో జరిగిన చాట్ సంభాషణలు లభించాయని తెలిపారు.
వివరాలు
భారత సైన్య కార్యకలాపాలపై నిఘా
భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ నుంచి ఐఎస్‌ఐతో అతడు నేరుగా సంప్రదింపులు కొనసాగిస్తున్నాడని, వాట్సప్ ద్వారా నిత్యం కమ్యూనికేషన్ చేస్తున్నాడని పేర్కొన్నారు. భారత సైన్య కార్యకలాపాలపై నిఘా పెట్టడం అతడి ప్రధాన పని అని అధికారులు వెల్లడించారు. రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో దళాల కదలికలు,సైనిక వాహనాలు,కీలక వంతెనలు, రైల్వే మార్గాలు, సరిహద్దు ప్రాంతాల ఫొటోలు, వీడియోలు సేకరించి అవన్నీ పాక్ వర్గాలకు పంపించినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు. తన అసలు గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు నిందితుడు ఇతరుల మొబైల్ నంబర్లను వినియోగించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఇతరుల ఫోన్‌లకు వచ్చే ఓటీపీలు సేకరించి.. వారి పేర్లతో వాట్సప్ ఖాతాలు తెరిచి వాటి ద్వారా గూఢచర్య సమాచారం పాక్‌కు చేరవేశాడని తెలిపారు.
వివరాలు
గ్రనేడ్ దాడులకు ప్రణాళిక..
ఈ అక్రమ కార్యకలాపాలకు ప్రతిఫలంగా అతడు పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో అతడి నెట్‌వర్క్‌లో ఉన్న మరికొందరిని గుర్తించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పుర్ ప్రాంతంలో గ్రనేడ్ దాడికి పాల్పడిన.. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్న ఉగ్రవాద మాడ్యూల్‌ను భద్రతా బలగాలు ఛేదించాయి.
వివరాలు
గ్రనేడ్ దాడులకు ప్రణాళిక..
కేంద్ర, రాష్ట్ర సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో కీలక నిందితులను గుర్తించినట్లు బోర్డర్ రేంజ్ డీఐజీ సందీప్ గోయల్ వెల్లడించారు. షాజాద్ భట్టి, జీషన్ అక్తర్, అనుదీప్ సింగ్ (అమన్ పన్ను) ఈ ముఠాలో ప్రధాన సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఈ గుంపు వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ, గ్రనేడ్ దాడులకు ప్రణాళికలు రూపొందించినట్లు దర్యాప్తులో తేలినట్టు అధికారులు పేర్కొన్నారు.