Army Chief: 88 గంటల ఆపరేషన్.. భారత సైనికులు పూర్తి సిద్ధంగా ఉన్నారు: ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ చీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, ఇది త్రివిధ సైనిక దళాల సమన్వయానికి మంచి ఉదాహరణని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. భద్రతా సవాళ్లను ఎదుర్కొనే విషయంలో భారత సైనికులు ఎంతగా సిద్ధంగా ఉన్నారో ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టమైందని ఆయన గుర్తు చేశారు. ''ఆపరేషన్ సిందూర్‌ను అత్యంత కచ్చితంగా అమలు చేశాం. 88 గంటల పాటు సాగిన ఆ ఆపరేషన్‌లో మన సైనిక దళాలు అత్యంత సమర్థతతో పని చేశాయి. ఉగ్రశిబిరాలను సమూలంగా నాశనం చేయగలిగాం. దాదాపు 100మంది ఉగ్రవాదులను హతమార్చాం. ఆ సమయంలో పెద్ద ఎత్తున బలగాలను సరిహద్దులకు కూడా తరలించాం.పాకిస్థాన్ చిన్న తప్పు చేసినా,భూతల దాడులను ప్రారంభించేందుకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం'' అని ఆర్మీ చీఫ్ వివరించారు.
వివరాలు
అప్రమత్తంగా ఉండటం అవసరం
అలాగే, ఈశాన్య సరిహద్దులో పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పటికీ, అప్రమత్తంగా ఉండటం అవసరమని ఆయన చెప్పారు. చైనా సరిహద్దు భద్రతను కూడా స్పష్టం చేస్తూ, భారత మోహరింపులు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి అనూహ్య ఘటనలు జరగడాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని పాకిస్థాన్‌కి పరోక్షంగా హెచ్చరించారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సున్నితంగా ఉన్నా, ప్రస్తుతం అవి పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని చెప్పారు.