
Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలానికి చేపట్టిన ఆపరేషన్ విజయవంతం : త్రివిధ దళాధిపతులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టడం తమ ప్రధాన లక్ష్యమని త్రివిధ దళాధిపతులు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో మే 7న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విజయవంతంగా దాడి నిర్వహించిందని వెల్లడించారు.
ఆ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తూనే భారత్‌పై దాడులకు పాల్పడుతోందని వారు విమర్శించారు.
అయితే, అలాంటి దాడులను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుని దేశ భద్రతను కాపాడిందని పేర్కొన్నారు.
పీవోకేలో చేపట్టిన ఆపరేషన్ అత్యంత విజయవంతంగా ముగిసిందని.. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు మరింత ఉగ్రవాద నిర్మూలన దిశగా సాగుతాయని త్రివిధ దళాధిపతులు స్పష్టంచేశారు.
Details
పాక్ కు చెందిన క్షిపణులను తిప్పికొట్టాం
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించామని, ఆ దాడుల్లో పాక్‌కు చెందిన అనేక డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొన్నారు.
ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం విజయవంతంగా మిషన్‌ను పూర్తి చేసిందన్నారు.
ఈ సందర్భంగా ఆర్మీ అధికారుడు ఏకే భారతి మాట్లాడుతూ.. ''పీవోకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మనం యుద్ధం చేశాం. అత్యాధునిక క్షిపణి వ్యతిరేక రక్షణ వ్యవస్థలతో పాక్ డ్రోన్లు, క్షిపణులను నేలకూల్చాం.
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'ఆకాశ్' మిసైల్ వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించాం.
Details
సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదు
చైనా తయారీ పీఎల్-15 క్షిపణిని కూడా తిప్పికొట్టాం. సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.
ఈ నేపథ్యంలో వైస్ అడ్మిరల్ ప్రమోద్ మాట్లాడుతూ.. 'భారత్ వైపు గగనతల దాడులను తక్షణమే గుర్తించి అడ్డుకున్నాం.
ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్లు, ఫ్లీట్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో పాటు డ్రోన్లు, హైస్పీడ్ మిసైళ్లను సమర్థంగా వినియోగించాం. నౌకాదళ అడ్వాన్స్‌డ్ రాడార్లతో పాక్ డ్రోన్లను గుర్తించగలిగాం.
సమగ్ర నిఘాతో అన్ని దాడులను నిరోధించగలిగామని వివరించారు. ఈ ఆపరేషన్‌తో పాక్ సైన్యం జోక్యం చేసుకునే ప్రయత్నాలు కూడా విజయవంతంగా తిప్పికొట్టినట్లు అధికారి పేర్కొన్నారు.