PM Modi: కుంభమేళాపై విపక్షాల విద్వేషపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
మహాకుంభమేళాను ఎగతాళి చేసిన ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మత సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ఆదివారం ఆయన విమర్శించారు.
మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. భారతదేశ మత వారసత్వాన్ని దెబ్బతీసే 'బానిస మనస్తత్వం' కలిగిన రాజకీయ నాయకులను తీవ్రంగా విమర్శించారు.
Details
మతాన్ని అపహాస్యం చేయడమే కొందరి లక్ష్యం
ఈ రోజుల్లో మతాన్ని ఎగతాళి చేసే, ప్రజలను విభజించే నాయకుల సమూహం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
విదేశీ శక్తులు కూడా ఈ వ్యక్తులకు మద్దతుగా నిలిచి, దేశాన్ని, మతాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయని మోదీ విమర్శించారు.
హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు శతాబ్ధాలుగా ఏదో ఒక దశలో కొనసాగుతూనే ఉన్నారని మోదీ అన్నారు.
సామాజిక ఐక్యతను దెబ్బతీయడమే వారి అసలు ఉద్దేశమని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో భాగేశ్వర్ ధామ్ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రిని ప్రశంసించారు.
ఆయన ఐక్యతను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కేన్సర్ చికిత్స కోసం మతపరమైన ప్రదేశంలో ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.
భాగేశ్వర్ ధామ్ ఇప్పుడు అవసరమైన వారికి వైద్య సహాయం కూడా అందిస్తోందని మోదీ అన్నారు.
Details
కుంభమేళాపై ప్రతిపక్ష నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలివే
కుంభమేళాపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పేదరికం పోతుందా? అంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.
కుంభమేళాలో తొక్కిసలాటను ప్రస్తావిస్తూ, 'మృత్యు కుంభ్' అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కుంభమేళాపై ప్రభుత్వాన్ని నిందించగా, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ గంగానదిలో మృతదేహాలను విసిరేశారని ఆరోపించారు.
ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కుంభమేళాను వ్యర్థమైనదిగా అభివర్ణించారు.