
Rahul Gandhi: వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా గెలవాల్సింది.. కానీ మోదీ వల్లే ఓటమి.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లోని జలోర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని పనౌతి (చెడు శకునం) అంటూ ఎద్దేవా చేశారు.
ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ను చూడడానికి నరేంద్ర మోదీ స్టేడియంలోకి అడుగుపెట్టగానే గెలిచే మ్యాచ్ కూడాఓడిపోయామని అన్నారు.
నరేంద్ర మోదీ ఇప్పటివరకు ఇచ్చిన ప్రసంగాలలో వెనుకబడిన తరగతుల (OBCలు)కి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకున్నారే తప్ప వారి అభివృద్ధికి ఏమీ చెయ్యలేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
OBCల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వారి అభివృద్ధిని కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.
Details
రాహుల్ క్షమాపణలు చెప్పాలి: రవిశంకర్ ప్రసాద్
నవంబర్ 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మంగళవారం తన మేనిఫెస్టో - 'జన్ ఘోష్ణ పాత్ర'ను విడుదల చేసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.
అధికారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల కోసం ఏడు హామీలను ప్రకటించింది.
పంచాయతీ స్థాయిలో నియామకాలు, కుల గణన కోసం కొత్త పథకాన్ని మేనిఫెస్టో హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు.
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పై తప్పుడు పదాలను ఎందుకు వాడాల్సివచ్చింది.అసలు ఆయనకు ఏమైందంటూ ప్రశ్నించారు.
రాహుల్ వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తున్నదని, వీలైనంత త్వరగా ఆయన క్షమాపణలు చెప్పాలని కోరారు.
Details
సోనియా అన్న మాటలతో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది: రవిశంకర్
గుజరాత్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ తల్లి సోనియా గాంఘీ ప్రధాని మోదీని 'మౌత్ కా సౌదాగర్' అని పిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సోనియా అన్న మాటలతో గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయిందని.. గతం నుంచి నేర్చుకోవాలని ఆయన అన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపై రాహుల్ గాంధీ వాడిన పదం చాలా నీచమైనదన్నారు.
దేశంలో క్రీడలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ కోరుకునే మార్గం ఇదేనా? అంటూ ప్రశ్నించారు.
ఒలింపిక్ పోడియం పథకం (TOPS) మోదీ ప్రభుత్వం టార్గెట్ అని అందువల్లే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్,పారాలింపిక్స్‌లో మన దేశం అద్భుతమైన విజయాలను సాధించిందని అన్నారు.