LOADING...
Delhi Metro: దిల్లీ మెట్రోలో హద్దులు దాటిన ప్రవర్తన.. వీడియో సోషల్ మీడియాలో వైరల్
దిల్లీ మెట్రోలో హద్దులు దాటిన ప్రవర్తన.. వీడియో సోషల్ మీడియాలో వైరల్

Delhi Metro: దిల్లీ మెట్రోలో హద్దులు దాటిన ప్రవర్తన.. వీడియో సోషల్ మీడియాలో వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కొంతమంది మహిళలు ప్రదర్శిస్తున్న ప్రవర్తన ఆందోళన కలిగించే స్థాయికి చేరుతోంది. ఇందుకు దిల్లీ మెట్రోలో చోటుచేసుకున్న తాజా సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా మారింది. ప్రజా రవాణా వ్యవస్థలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన చోట, కొందరు అసభ్యంగా వ్యవహరిస్తూ వీడియోలు చిత్రీకరించడంతో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో రోజూ లక్షలాది మంది ప్రజలు మెట్రో రైళ్లపై ఆధారపడి ప్రయాణం చేస్తుంటారు. వాయుకాలుష్యం, ట్రాఫిక్ సమస్యల కారణంగా ఇటీవలి కాలంలో మెట్రో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. దీంతో మెట్రో రైళ్లు ఎప్పుడూ రద్దీగా మారుతున్నాయి. ఈ క్రమంలో సీట్ల కోసం గొడవలు జరగడం, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడం గతంలోనూ కనిపించింది.

Details

ఫ్లాట్‌ఫామ్‌పై పడిపోయిన మహిళ

అయితే తాజాగా కొందరు ఈ రద్దీని కూడా వైరల్ కంటెంట్ కోసం వాడుకుంటుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తాజాగా ఇద్దరు స్నేహితురాలైన మహిళలు ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు తీయడానికి ప్రయత్నించారు. అందులో ఒక మహిళ మెట్రో డోర్ దగ్గర నిలబడి ఉండగా, మరో మహిళ రెయిలింగ్‌కు అమర్చిన పట్టీలను పట్టుకుని ఊయలలా ఊగుతూ ఆమెను తన్నింది. దీంతో డోర్ వద్ద నిలబడ్డ మహిళ ఫ్లాట్‌ఫామ్‌పై పడిపోయింది. డోర్ పూర్తిగా మూసుకుపోకముందే ఆమె మళ్లీ లోపలికి వచ్చి, ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ చెంపదెబ్బలు కొట్టుకుంటూ సరదాగా వ్యవహరించడం వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

Details

రెండ్రోజుల క్రితం జుట్టుపట్టుకొని కొట్టుకున్న మహిళలు

ఇదే కాకుండా మరో వీడియోలో 'పియా ఆయే నా' పాటకు ఓ వ్యక్తి మెట్రోలో నృత్యం చేస్తూ కనిపించాడు. అలాగే కొన్ని రోజుల క్రితం ఇద్దరు మహిళలు ఒకరినొకరు జుట్టు లాగుకుంటూ కొట్టుకున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ వరుస ఘటనలు మెట్రోలో క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన, బాధ్యతారహితమైన ప్రవర్తనగా వారు విమర్శిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే జరిమానాలు విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి రీల్స్, గొడవలు, స్టంట్లు వంటి వీడియోలు మెట్రోలో తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement