LOADING...
flights to West Asia: పశ్చిమాసియా ఉద్రిక్తతలు: 10వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు..
పశ్చిమాసియా ఉద్రిక్తతలు: 10వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు..

flights to West Asia: పశ్చిమాసియా ఉద్రిక్తతలు: 10వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత్‌పై కూడా పడుతోంది. ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులను దేశీయ ఎయిర్‌లైన్స్ వరుసగా రద్దు చేస్తున్నాయి. యుద్ధ పరిస్థితులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 వేలకుపైగా విమానాలు రద్దయ్యాయని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. సాధారణంగా భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు రోజుకు సుమారు 300 నుంచి 350 విమానాలు నడుస్తుంటాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గి రోజుకు కేవలం 80 నుంచి 90 విమానాలకే పరిమితమైందని అధికారులు తెలిపారు.

వివరాలు 

పైలట్ల డ్యూటీ సమయాల్లో సడలింపు

ఇక మరోవైపు, దీర్ఘదూర విమాన ప్రయాణాల నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్లకు వర్తించే 'ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్' నిబంధనలను తాత్కాలికంగా సడలించినట్లు ప్రకటించింది. విమాన సేవలు నిరాటంకంగా కొనసాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Advertisement