LOADING...
Padma Awards: పద్మ పురస్కారాల ప్రకటన.. 45 మందికి అవార్డులు
పద్మ పురస్కారాల ప్రకటన.. 45 మందికి అవార్డులు

Padma Awards: పద్మ పురస్కారాల ప్రకటన.. 45 మందికి అవార్డులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2026
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 'పద్మ పురస్కారాలను' ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది. సైన్స్‌, వ్యవసాయం, కళలు, సంస్కృతి, సామాజిక సేవ వంటి విభాగాల్లో అసాధారణ కృషి చేసినవారికి ఈ జాబితాలో ప్రాధాన్యం కల్పించింది. ఈసారి ప్రకటించిన పద్మ శ్రీ జాబితాలో తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖులు చోటు దక్కించుకోవడం విశేషం. సీసీఎంబీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, సైన్స్ రంగంలో అందించిన సేవలకు గానూ పద్మశ్రీకి ఎంపికయ్యారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన మామిడి రామరెడ్డి పశుసంవర్ధక రంగంలో చేసిన విశేష కృషికి ఈ గౌరవాన్ని అందుకున్నారు.

Details

దక్షిణ భారతదేశానికి పలువురికి పద్మశ్రీ

దక్షిణ భారతదేశానికి చెందిన పలువురు కూడా ఈసారి పద్మశ్రీ పురస్కారాలతో సత్కరింపబడ్డారు. తమిళనాడుకు చెందిన నటేశన్‌, తిరువారూర్ భక్తవత్సలం, ఆర్. కృష్ణన్‌, తిరుత్తని స్వామినాథన్‌ లకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. కళలు, సంస్కృతి రంగాల్లో సేవలందించినందుకు బుధ్రి టాటి, మేవాటి జోగి, హ్యాలీవార్, ఖేమ్ రాజ్, శ్రీరంగ్ దేవాబా, యుమ్నం జాత్రా సింగ్ లకు పద్మశ్రీ వరించింది. వ్యవసాయం, పర్యావరణ రంగాల్లో విశేష కృషి చేసిన అంకెగౌడ, దేవకి అమ్మాజీ, ఎస్జీ సుశీలమ్మ, తాగా రామ్‌భీల్ లను కూడా ఈ జాబితాలోకి తీసుకుంది. ఇతర విభాగాల్లో సేవలందించిన ఫెర్నాండేజ్, భగవాన్‌దాస్,ధిండా, బ్రిజ్‌లాల్, చిరంజీ లాల్ యాదవ్, హ్యాజీభాయి, మోహన్ ల సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.

Details

దేశవ్యాప్తంగా హర్షం

ఇదే జాబితాలో చరణ్, ధార్మిక్‌లాల్, ఇందర్‌జిత్, పజనివేల్, కైలాస్ చంద్ర, మహేంద్ర కుమార్, నరేష్ చంద్రదేవ్, నిలేష్ వినోద్‌చంద్ర, నూరుద్దీన్ అహ్మద్, పద్మా గుర్మెట్, లేఖ్తేపి, రఘుపత్ సింగ్, రఘువీర్ తుకారామ్, రాజస్తపతి, రామచంద్ర, పొంగెనర్, షఫీ షౌక్, శ్యామ్ సుందర్, సిమాంచల్ పాత్రో, సురేష్, తేచీ గుబిన్ విశ్వ బంధు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల్లో జన్యు శాస్త్రవేత్తలు, సామాన్య రైతులు, జానపద కళాకారులు చోటు దక్కించుకోవడం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సమాజానికి నిశ్శబ్దంగా సేవ చేసిన వారిని గుర్తించి గౌరవించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement