LOADING...
Padma Shri Awards 2026: తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు
తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు

Padma Shri Awards 2026: తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2026
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాదికి పద్మశ్రీ అవార్డుల కోసం మొత్తం 45 మంది ప్రతిష్ఠాత్మక వ్యక్తులను ఎంపిక చేయగా, అధికారిక ప్రకటన 25 జనవరి ఆదివారం విడుదలైంది. పద్మశ్రీ అవార్డులు భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవల వంటి విభిన్న రంగాల్లో విశిష్ట సేవలకు గుర్తింపుగా అవార్డులు ప్రదానం చేయబడతాయి. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందజేస్తారు.

Details

కుమారస్వామి తంగరాజ్‌కు పద్మశ్రీ అవార్డు

ఈ ఏడాదిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB)లో పనిచేస్తున్న తంగరాజ్‌కి జన్యుసంబంధ పరిశోధనలలో చేసిన విశిష్ట సేవలకు ఈ అవార్డు దక్కింది. తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డికు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. పాడి, పశుసంవర్ధక విభాగాల్లో చేసిన సేవలకు గుర్తింపు కలిగింది.

Details

తంగరాజ్ సేవలు

హైదరాబాద్‌లోని CCMBలో చీఫ్ సైంటిస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్ తంగరాజ్, జన్యుసంబంధిత పరిశోధనల్లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. ఆయన భారతీయ జనాభా జన్యు వైవిధ్యంపై చేసిన లోతైన అధ్యయనాలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. దక్షిణ ఆసియా ప్రజల పూర్వీకుల మూలాలను గుర్తించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా వంశపారంపర్య వ్యాధుల నిర్ధారణలో చేసిన కృషికి కూడా తంగరాజ్‌కు పద్మశ్రీ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఆయన CDFD డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Advertisement