Page Loader
తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌
రెండు రైళ్లు రీ షెడ్యూల్‌

తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 19, 2023
06:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతి రైల్వే స్టేషన్ యార్డులో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. రైలును షంటింగ్ (మరో బోగిని అతికించడం) చేస్తుండగా చివరి బోగీ ప్రమాదానికి గురైంది. ఈ మేరకు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ బయలుదేరాల్సిన 2 రైళ్లు రీషెడ్యూల్‌ అయ్యాయి. సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి 7.45కు మార్చారు.5.30 గంటలకు బయలుదేరాల్సిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి 8 గంటలకు పోస్ట్ పోన్ చేశారు. ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు లేని భోగిని అతికించే క్రమంలో రైలు పట్టాలు తప్పింది. గమనించిన సిబ్బంది వెంటనే బోగీని పట్టాలపైకి ఎక్కించారు. సదరు రైలు ఇంకా ఫ్లాట్ పామ్ పైకి రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌