Page Loader
PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ
పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ

PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2025
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ 'మనసులో మాట' పేరుతో ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో 121వ ఎపిసోడ్‌లో పహల్గాం ఉగ్రదాడిని (Pahalgam attack) తీవ్రంగా ఖండించారు. ఈ దాడి తనను అత్యంత బాధించింది, ప్రతి భారతీయుడూ ఈ దారుణాన్ని మర్చిపోలేకపోతున్నారని అన్నారు. జమ్మూకశ్మీర్‌ అద్భుతమైన పురోగతిని సాధిస్తుండగా, దానిని చూసి ఊరుకునే ఉగ్రవాదులు ఈ ప్రాంతాన్ని దెబ్బతీసేందుకు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులపై దాడి చేసి, తమ అసమ్మతిని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ దాడి బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు.