
Pakistan: మరోసారి కాల్పులకు దిగిన పాకిస్తాన్.. కౌంటర్ ఇచ్చిన భారత సైనికులు..
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ దాడికి తగిన ప్రతీకారం తీసుకుంటామని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎల్ఓసీ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘిస్తూ వస్తోంది. గత 11 రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం నిరంతర కాల్పులకు తెగపడుతోంది.
మే 4వ తేదీ రాత్రి పాక్ ఆర్మీ జమ్ము కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడింది.
ఈ కాల్పులు కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్‌బాని, అఖ్నూర్ ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి.
ఈ చర్యలపై అప్రమత్తమైన భారత ఆర్మీ సమర్థవంతంగా ప్రతిస్పందించి, పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టింది.
వివరాలు
పాక్ పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు
అలాగే, ఏప్రిల్ 22న పహల్గామ్ ప్రాంతంలోని బైసారన్ లోయలో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణలేని కాల్పులకు దిగారు.
ఈ దారుణ ఘటనలో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది.
దాయాది దేశంగా పాక్ పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది.
ఇక భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తత పరిస్థితిని సమీక్షించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నేటి రోజు ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశముంది.