Page Loader
Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు
హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు

Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తున్న పలువురు భారతీయుల్ని అధికారులు గుర్తించి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు ఎనిమిది మంది గూఢచారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులలో విద్యార్థులు,యూట్యూబర్లు,వ్యాపారవేత్తలు,భద్రతా గార్డులు వంటి వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. తాజాగా మరో అనుమానితుడిని అరెస్ట్‌ చేశారు.హర్యానా రాష్ట్రంలోని నుహ్‌ ప్రాంతంలో సోమవారం రోజు అధికారులు ఓ అనుమానితుడిని పట్టుకున్నారు.

వివరాలు 

రజక గ్రామానికి చెందిన అర్మాన్‌ అరెస్ట్ 

అతని పేరు మహ్మద్‌ తారీఫ్‌గా గుర్తించబడింది.ఈయన మేవాట్‌ జిల్లాలోని టౌరు తహసీల్‌కు చెందిన కంగర్కా గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. తారీఫ్‌ పాక్‌ గూఢచారి సంస్థలకు భారత దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పంపిస్తున్నాడని విచారణలో తేలింది. ఇదే ప్రాంతమైన నుహ్‌లో రెండు రోజుల క్రితం రజక గ్రామానికి చెందిన అర్మాన్‌ను కూడా గూఢచర్య ఆరోపణలపై అరెస్ట్‌ చేశారు. ఇక 'ఆపరేషన్‌ సిందూర్‌' అనంతరం దేశవ్యాప్తంగా పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాలు 

పాకిస్థాన్‌ ఇంటర్ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ISI) కోసం ఈ ఏడుగురూ పని చేస్తున్నారు

అరెస్టైన వారిలో పంజాబ్‌ నుంచి గజాలా, ఉత్తరప్రదేశ్‌ నుంచి యాసీన్ మొహమ్మద్‌, నోమాన్ ఇలాహి, షహజాద్ (మొరాదాబాద్‌కి చెందినవాడు),హర్యానాలోని నుహ్‌ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అర్మాన్, కైతాల్‌కు చెందిన 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ ధిల్లాన్, జలంధర్‌కు చెందిన మహమ్మద్ ముర్తజా అలీ, యూట్యూబర్‌గా వ్యవహరిస్తున్న హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ఉన్నారు. ఇప్పుడు నుహ్‌లోని మహ్మద్ తారీఫ్ అరెస్టుతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ ఏడుగురూ పాకిస్థాన్‌ ఇంటర్ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ISI) కోసం పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.