Page Loader
Palla Rajeshwar Reddy: కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ 
Palla Rajeshwar Reddy: కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

Palla Rajeshwar Reddy: కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2024
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్యెల్యే కడియం శ్రీహరి పై బిఆర్ఎస్ ఎమ్యెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సిగ్గు,శరం ఉంటే బిఆర్ఎస్ ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులకు లొంగి , పదవుల పేరుతో బిఆర్ఎస్ కు , తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకారిగా కడియం తయారయ్యాడని పల్లా వ్యాఖ్యానించారు. ఆనాడు ఎన్టీఆర్ కు,ఈరోజు కెసిఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి అని,ప్రజలు చి కొడుతారు . నోట్లో ఉమ్మి వేసి ,చెప్పులతో కొడతారన్నారు. కూతురి సీట్ కోసం బిఆర్ఎస్ లోని దళిత నేతలను,ఉద్యమకారులను కడియం శ్రీహరి బయటకు పంపారని మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరిని వదిలిపెట్టేదేలేదని హెచ్చరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి