Page Loader
Pamban Bridge: పాంబన్ వంతెన దేశానికి అంకితం.. ప్రారంభించిన మోదీ
పాంబన్ వంతెన దేశానికి అంకితం.. ప్రారంభించిన మోదీ

Pamban Bridge: పాంబన్ వంతెన దేశానికి అంకితం.. ప్రారంభించిన మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2025
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో ఆధునిక సాంకేతికత ద్వారా కలుపుతున్న పాంబన్ వంతెన (Pamban Bridge)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అంకితం చేశారు. ఇది దేశంలో నిర్మితమైన మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సముద్ర వంతెనగా నిలిచింది. ఈ వంతెన సముద్రంపై 2.08 కిలోమీటర్ల పొడవులో నిర్మించారు. వంతెన దిగువన ఓడల రాకపోకలకు అనువుగా ఓ కీలకమైన వర్టికల్‌ లిఫ్ట్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌(RVNL) నిర్మాణ పనులను ప్రారంభించి, నాలుగు సంవత్సరాల్లో విజయవంతంగా పూర్తి చేసింది.

Details

రూ.8,300 కోట్ల విలువైన నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన

ఈ సందర్భంగా రామేశ్వరం - తాంబరం ప్రత్యేక రైలును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ రైలు తాజాగా ప్రారంభమైన పాంబన్ వంతెనపై ప్రయాణం చేసింది. ఈ రైలులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదే సమయంలో వంతెన కిందగా సాగిన కోస్ట్‌ గార్డ్‌ నౌకకు పచ్చజెండా ఊపి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, తమిళనాడు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు తదితర ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ప్రధానమంత్రి మోదీ రూ.8,300 కోట్ల విలువైన నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం తోపాటు, పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు. అనంతరం రామేశ్వరంలోని జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించి, ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రారంభించిన మోదీ