Page Loader
వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి
మార్చి 2023 నాటికి పాన్ - ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి

వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 30, 2022
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ కార్డు ఉన్నవారు తమ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తుది హెచ్చరిక జారీ చేసింది. మార్చి 31, 2023లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే, పాన్ పనిచేయదు. PANకి లింక్ చేయబడిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను పెండింగ్ రిటర్న్స్ ప్రాసెసింగ్ నుండి నిలిపివేయబడతాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి చివరి తేదీని 31 మార్చి 2022 నుండి 31 మార్చి 2023 వరకు పొడిగించింది. లింకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి ప్రజలు రూ. 1000 రుసుము చెల్లించాలి. లింకింగ్ అనేది చట్టపరమైన అవసరాల కోసం ఒక ప్రక్రియ అయితే, ఈ ప్రక్రియ ప్రభుత్వానికి, పన్ను చెల్లింపుదారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

ఆధార్

ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం వల్ల పన్ను ఎగవేతలను గుర్తించచ్చు

ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం వల్ల పన్ను ఎగవేతలను గుర్తించడానికి పన్ను చెల్లింపుదారుల లావాదేవీలను ట్రాక్ చేయడానికి IT విభాగాలకు సహాయపడుతుంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ద్వారా బహుళ పాన్ కార్డ్‌లు ఉన్న వ్యక్తులను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది. భారతదేశంలోని నివాసితులకు ఒక ఆధార్‌ మాత్రమే ఉండాలి, వారి పేరు మీద ఒక పాన్ కార్డ్‌ మీద జరిగిన లావాదేవీలను ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. పాన్, ఆధార్ ఆదాయపు పన్ను రిటర్న్ ప్రక్రియ,ధృవీకరణను కూడా సులభతరం చేస్తాయి. బయోమెట్రిక్ ధృవీకరణతో సహా ఒక వ్యక్తికి సంబంధించిన మొత్తం సమాచారం ఆధార్ లో ఉండటం వలన, లింక్ చేయడం వలన రిటర్న్ ఫైలింగ్ సులభంగా చేయచ్చు.