Loading...
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల నామినేషన్లకు పోలీసు భద్రత తప్పనిసరి!
ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల నామినేషన్లకు పోలీసు భద్రత తప్పనిసరి!

AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల నామినేషన్లకు పోలీసు భద్రత తప్పనిసరి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఏపీ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించింది. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది.

వివరాలు

పోలీసు భద్రత కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు

సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయాలని భావిస్తున్న పలువురు అభ్యర్థులు తమకు పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

నామినేషన్లు వేసేందుకు పోలీసు రక్షణ కోరినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని పిటిషనర్లు తమ పిటిషన్లలో పేర్కొన్నారు.

వివరాలు

ఈ-మెయిల్‌, వాట్సాప్ వినతులను పరిశీలించాలని ఆదేశం

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు పోలీసు భద్రత కోరుతూ ఈ-మెయిల్‌, వాట్సాప్ ద్వారా సమర్పించిన వినతులను పరిగణనలోకి తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది.

నామినేషన్లు దాఖలు చేసేందుకు పిటిషనర్లకు తగిన పోలీసు భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.

దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు వేసే సమయంలో భద్రత కల్పించే విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చినట్లయింది.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే జరిగిన మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాజాగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు హైకోర్టు ఆదేశాలు ఊరటనిచ్చాయి.

ADVERTISEMENT