తదుపరి వార్తా కథనం

Andhra Pradesh News:పాపికొండల విహారయాత్రకు బ్రేక్.. గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం..
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 02, 2025
10:46 am
ఈ వార్తాకథనం ఏంటి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గోదావరి నదిలో నీటి స్థాయి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవీపట్నం నుంచి పాపికొండల వైపు సాగే బోటు విహారయాత్రలను జలవనరుల శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. వర్షపాతం కారణంగా నదిలో వరద ప్రవాహం అధికమవడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఇక మరోవైపు, దేవీపట్నం మండలానికి చెందిన దండంగి, డి.రావిలంక గ్రామాల మధ్య నడిచే ఆర్అండ్‌బీ రహదారిపై గోదావరి వరద ప్రవాహం పెరిగింది. ఫలితంగా, గండి పోచమ్మ ఆలయం వైపు ప్రయాణాలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.