LOADING...
Pariksha Pe Charcha: పరీక్షాపే చర్చ.. 9వ ఎడిషన్'లో విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ
పరీక్షాపే చర్చ.. 9వ ఎడిషన్'లో విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ

Pariksha Pe Charcha: పరీక్షాపే చర్చ.. 9వ ఎడిషన్'లో విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పరీక్షల ముందు ఒత్తిడిని తగ్గించి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి నిర్వహించే ప్రధానమంత్రి పరీక్షాపే చర్చా కార్యక్రమంలో (Pariksha Pe Charcha) ప్రధాని నరేంద్ర మోదీ వారితో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను మోదీ శుక్రవారం తన అధికారిక వేదిక ద్వారా షేర్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ 

వివరాలు 

ఇది ఎదుగుదలకు అత్యంత కీలకం

"విద్యార్థులతో పరీక్షలను సానుకూల దృక్పథంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి అద్భుతమైన చర్చ జరిగింది. అందరూ ఈ వీడియోని చూడండి".అని రాసుకొచ్చారు. ఈ వీడియోలో మోదీ (PM Modi) విద్యార్థులతో మాట్లాడుతూ.. "నేను ప్రధానమంత్రి అయినా, ప్రజలు నా పనితీరు గురించి ఎన్నో సూచనలు ఇస్తారు. వాటన్నింటినీ గౌరవించాలి, కానీ మనకు ఉపయోగపడే సూచనల్ని మాత్రమే తీసుకోవాలి. నేను కూడా కొన్ని సూచనలను స్వీకరించి, నా పనిలో మార్పులు చేశాను, కానీ నా విలువలను వదలలేదు. చదువు, విశ్రాంతి, అలవాట్లు, నైపుణ్యాల్లో సమతుల్యత (బ్యాలెన్స్) ఉండేలా చూసుకోవాలి. ఇది ఎదుగుదలకు అత్యంత కీలకం.

Advertisement

వివరాలు 

ఇంటర్నెట్ వాడకంలో సమయం వృథా చేయకండి

ఆటలు ఆడటం కూడా ఒక నైపుణ్యం;వాటిని కేవలం సరదాగా మాత్రమే చూడవద్దు. జూదం లేదా బెట్టింగ్‌ల వంటి కార్యకలాపాల నుండి దూరంగా ఉండండి;మన దేశంలో వీటికి వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. అలాగే గతం దగ్గరే ఆగిపోకుండా.. మీ ముందున్న దాన్ని చూసేందుకు ప్రయత్నించండి.ఇంకా చేయాల్సిన పనుల గురించి ఆలోచించండి. ఇంటర్నెట్ వాడకంలో సమయం వృథా చేయకండి, అది తక్కువ ధరకే లభిస్తుంది. పరీక్షలను పండుగలా చూడండి, ప్రతీదానిలో మీరు స్వయంగా పోటీ పడండి"* అని ఆయన సూచించారు. ప్రతిఒక్కరి ఆలోచనా విధానానికి తేడా ఉంటుందని గుజరాత్‌ విద్యార్థి సాన్య అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈసారి పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు 4.5 కోట్ల మంది నమోదయ్యారు.

Advertisement