Loading...
Andhra Pradesh: శ్రీసత్యసాయి తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌..  
శ్రీసత్యసాయి తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌..

Andhra Pradesh: శ్రీసత్యసాయి తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌..  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌ నూతన పాలకమండళ్లు కొలువుదీరాయి. కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌,వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌ బాధ్యతలు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్లచెరువు జడ్పీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఘన విజయం సాధించారు. జడ్పీఛైర్మన్‌ పదవికి సంబంధించి పలు ఊహాగానాలు కొనసాగినప్పటికీ..చివరకు ఉత్కంఠకు తెరదించుతూ పరిటాల శ్రీరామ్‌ పేరును ప్రకటించారు. దివంగత పరిటాల రవీంద్ర రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందిన శ్రీరామ్‌కు ఈ పదవి దక్కడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

వివరాలు 

వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవిపై అసంతృప్తి.. 

ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయనకు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించడంపై పార్టీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాకినాడ జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఎంపిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

ఛైర్‌పర్సన్‌ పదవిని ఆశించిన తెదేపా జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి అనంతలక్ష్మికి వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవి కేటాయించడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు, తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ ఆమె నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.

కూటమి నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని సూచిస్తూ ఆమెకు నచ్చజెప్పారు.

వివరాలు 

ప్రమాణస్వీకారానికి దూరంగా పిల్లి అనంతలక్ష్మి

వారి విజ్ఞప్తికి అంగీకరించిన అనంతలక్ష్మి జిల్లా పరిషత్‌ సమావేశానికి హాజరయ్యారు.

అయితే కొద్దిసేపు సమావేశ మందిరంలో కూర్చున్న అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

జడ్పీటీసీ సభ్యురాలిగా కూడా ఆమె ప్రమాణ స్వీకారం చేయలేదు.

వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవి కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న ఆమె.. చివరకు జడ్పీటీసీగా ప్రమాణం చేయకుండానే సమావేశం నుంచి నిష్క్రమించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ADVERTISEMENT