Parvesh Varma: దిల్లీ సీఎం అభ్యర్థిగా పర్వేష్ వర్మ? అమిత్ షాతో కీలక చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించి, ఆప్ అగ్రనేతలను ఓడించి దిల్లీపై పట్టు సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించగా, 22 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం దక్కించుకుంది.
ఈ ఫలితాల్లో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమి పాలవడం గమనార్హం. న్యూ దిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్‌కు బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ గట్టి పోటీ ఇచ్చారు.
కొన్ని రౌండ్లు మినహా మిగతా అన్ని రౌండ్లలో పర్వేష్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించి, కేజ్రీవాల్‌ను ఓడించారు.
ఇప్పుడేమో, దిల్లీలో బీజేపీ విజయం తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
Details
ముందు వరుసలో పర్వేష్ వర్మ
పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమించవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ ముందు వరసలో ఉన్నారు.
విజయం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్వేష్ వర్మను కలిశారు. పర్వేష్ వర్మ, మాజీ సీఎం సాహెబ్ సింగ్ కుమారుడిగా మంచి పేరు సంపాదించారు.
న్యూదిల్లీ నుంచి పోటీ చేసిన పర్వేష్ వర్మ, కేజ్రీవాల్ ప్రచారాన్ని ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేయడంలో విజయం సాధించారు.
పర్వేష్ వర్మ ప్రభావంతో కేజ్రీవాల్ ఎక్కువగా తన నియోజకవర్గం గురించే కేంద్రీకరించాల్సి వచ్చింది.
దీంతో దిల్లీలోని మిగతా ఆప్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి కేజ్రీవాల్‌కు తగిన సమయం దొరకలేదు. బీజేపీ వ్యూహం కేజ్రీవాల్‌పై విజయవంతమై, ఆప్‌ను కష్టాల్లోకి నెట్టింది.