Air India: ముంబై విమానాశ్రయంలో సిబ్బందిపై ప్రయాణికురాలి దాడి
ముంబై ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బందిపై ఓ ప్రయాణికురాలు దాడి చేసిన ఘటన సెప్టెంబర్ 1న జరిగింది. ముంబై విమానాశ్రయంలో ప్రయాణికురాలు గ్రౌండ్ ఆపరేషన్స్ పార్టనర్‌తో అనుచితంగా ప్రవర్తించాడని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు. డ్యూటీ మేనేజర్ వెంటనే CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) అధికారులకు సమాచారమందించారు. ఆపై సదరు ప్రయాణికురాలిని పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తికి చెక్-ఇన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు.. మహిళా ప్రయాణికురాలిని వేచి ఉండమని కోరినట్లు తెలిసిందన్నారు.
దాడిపై స్పందించిన ఎయిర్ లైన్స్
కొద్దిసేపు వేచి ఉండమని కోరడంతో ప్రయాణికురాలు రెచ్చిపోయింది. దుర్భాషలాడుతూ ఎయిర్‌లైన్ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ స్పందించింది. తమ అతిథులు, ఉద్యోగులు, భాగస్వాముల భద్రతకు హాని కలిగించే ప్రవర్తనకు తాము జీరో-టాలరెన్స్ విధానాన్ని పాటిస్తామని స్పష్టం చేసింది.