
NewsBytesExplainer: పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం.. ప్రమాదమా? హత్యా?.. రాజకీయ నాయకుల స్పందన ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పు గోదావరి జిల్లా కొంతమూరు వద్ద క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
రాజమండ్రి సమీపంలో జరిగిన ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఘటన వివరాలు
పగడాల ప్రవీణ్ కుమార్ మార్చి 24న హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్‌పై బయలుదేరి రాజమండ్రికి వెళ్లారు.
రాత్రి 11.31 నిమిషాలకు కొవ్వూరు టోల్ గేట్ దాటి, 11.42 నిమిషాలకు కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంకు దగ్గర ప్రమాదానికి గురయ్యారని పోలీసులు వెల్లడించారు.
బుల్లెట్ వాహనం అదుపుతప్పి రహదారి పక్కన లోతైన ప్రాంతంలో పడిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.
Details
క్రైస్తవ సంఘాల అనుమానాలు
క్రైస్తవ సంఘాలు, కుటుంబ సభ్యులు మాత్రం ఇది ప్రమాదం కాదని, పాస్టర్ ప్రవీణ్ కుమార్ హత్యకు గురయ్యారని అనుమానం వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదమైతే అతని ఒంటిపై గాయాలు భిన్నంగా ఉండేవని వారు అభిప్రాయపడ్డారు.
హెల్మెట్ పూర్తిగా సమస్తంగా ఉండటం, చొక్కాపై బూటు ముద్రలు ఉండటం అనుమానాస్పద అంశాలుగా పేర్కొన్నారు.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు
పోలీసులు సంఘటనా స్థలం సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు.
ప్రవీణ్ కుమార్ వాహనాన్ని ఐదు వాహనాలు దాటి వెళ్లినట్లు గుర్తించారు.
రెడ్ కలర్ కారును ప్రత్యేకంగా అనుమానితంగా పరిశీలిస్తున్నారు. - హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ప్రయాణించిన అన్ని మార్గాల్లో దర్యాప్తు చేపట్టారు.
Details
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
క్రైస్తవ సంఘాలు, కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, ఇద్దరు క్రైస్తవ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం చేయాలని వారు కోరగా, అధికారులు అంగీకరించారు.
కేఏ పాల్, హర్షకుమార్ స్పందన
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు.
సీసీ టీవీ ఫుటేజీ పూర్తిగా విడుదల చేసి, పోస్టుమార్టం నివేదిక పారదర్శకంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Details
రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తా
ఇది ప్రమాదం కాదని ఇది హత్య అని నా వ్యక్తిగత విచారణలో తేలిందని, కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. ఈ కేసును రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి రీ-ఇన్వెస్టిగేషన్ జరిపిస్తానని పేర్కొన్నారు.
పోలీసుల హెచ్చరిక
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ కిశోర్ హెచ్చరించారు.
Details
మరణంపై బిషప్ ప్రతాప్ సిన్హా అనుమానాలు
ప్రవీణ్ కుమార్ వాహనం, హెల్మెట్, దుస్తుల పరిశీలన ఆధారంగా ఇది ప్రమాదం కాదని అనిపిస్తోంది.
లోతైన ప్రాంతంలో పడిపోయినట్లు అయితే, వాహనం, మృతదేహం వేర్వేరు ప్రాంతాల్లో ఉండాలి. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు.
పోస్టుమార్టం నివేదిక రేపు విడుదల
మార్చి 29న పోస్టుమార్టం నివేదిక విడుదల కానుందని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులకు నివేదిక అందజేయనున్నారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.