Page Loader
Pawan Kalyan: 'మీకు స్లోగన్స్ ఎక్కడ ఇవ్వాలో తెలియదా'?.. అభిమానులపై పవన్ ఆగ్రహం!
'మీకు స్లోగన్స్ ఎక్కడ ఇవ్వాలో తెలియదా'?.. అభిమానులపై పవన్ ఆగ్రహం!

Pawan Kalyan: 'మీకు స్లోగన్స్ ఎక్కడ ఇవ్వాలో తెలియదా'?.. అభిమానులపై పవన్ ఆగ్రహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2024
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన జవహర్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్, ప్రతిపక్ష పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే, పవన్ మీడియాతో సీరియస్‌గా మాట్లాడుతుండగా, ఆయన అభిమానులు చేసిన ప్రవర్తనతో అసహనం వ్యక్తం చేశారు.

Details

అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

ఎంపీడీఓ దాడి ఘటనపై మాట్లాడుతుండగా అభిమానులు ఓజీ... ఓజీ... ఓజీ... సీఎం... సీఎం అంటూ నినాదాలు మొదలుపెట్టారు. ఈ వ్యవహారంపై అసహనానికి గురైన పవన్ కళ్యాణ్, అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎక్కడ ఏం స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియకపోతే ఎలా? పక్కకు వెళ్లండంటూ తిట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, వివిధ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో