Pawan Kalyan-Nagababu: నాగబాబుకు మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలన్న విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
రాజకీయాల్లో పని తీరు ప్రామాణికంగా ఉండాలని, ఒక నాయకుడు తన మన అనేది చూడకూడదన్నారు. తనతో కలిసి పని చేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు.
నాగబాబు జనసేన కోసం ఎంతో కృషి చేశారని, వైసీపీ నేతలతో తిట్లు తిన్నారని పవన్ పేర్కొన్నారు.
ముందుగా నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తామని, ఆ తర్వాత మంత్రి పదవిని పరిశీలిస్తామని తెలిపారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
Details
పనితీరును బట్టి పదవులు ఇస్తాం
నాగబాబు విషయంలో అడుగుతున్నారు కానీ, వైఎస్ జగన్ విషయంలో ఎవరూ ప్రశ్నించరని పేర్కొన్నారు.
కులాన్ని బట్టి కాదు, పనితీరును బట్టి పదవులు ఇస్తామన్నారు. కందుల దుర్గేష్ ఏ కులానికి చెందినవారో తనకు తెలియదని, కానీ ఆయన పనితీరును చూసి మంత్రి పదవి ఇచ్చామని పవన్ వివరించారు.
తనకు పార్టీని నడిపించడానికి తగిన సమయం దొరకడం లేదని, జనవరి 4 నుంచి 14లోగా బాగా ప్రిపేర్ అవుతామని పవన్ చెప్పారు.
ఇంకా ఏ జిల్లా నుండి పర్యటన ప్రారంభిస్తామనేది నిర్ణయించలేదని తెలిపారు.
Details
తాబేళ్ల రక్షణ కోసం పూర్తి స్థాయిలో చర్యలు
సామాన్యుల సమస్యలను అర్థం చేసుకోవాలంటే లెఫ్ట్ మార్గం ముఖ్యమని, గద్దర్‌తో చాలా అంతరంగిక సంభాషణలున్నాయని చెప్పారు.
సంక్షేమ పథకాల మీద మాత్రమే ప్రజల అభివృద్ధి ఆధారపడకూడదని పవన్ అన్నారు. తాజాగా ఆలివ్ రిడ్లే తాబేళ్ల మరణాలపై పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.
పర్యావరణ కాలుష్యం కారణంగానే వీటి మరణాలు చోటు చేసుకున్నాయని, తాబేళ్ల రక్షణ కోసం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.