Page Loader
Prakash Raj: పవన్ కళ్యాణ్ విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారు : ప్రకాశ్ రాజ్
పవన్ కళ్యాణ్ విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారు : ప్రకాశ్ రాజ్

Prakash Raj: పవన్ కళ్యాణ్ విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారు : ప్రకాశ్ రాజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2024
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుమల లడ్డు వివాదంలో పవన్ ప్రజలను మతపరంగా రెచ్చగొడుతున్నారని గతంలో కూడా ప్రకాశ్ రాజ్ విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ వివాదంతో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. తాజాగా మరోసారి పవన్‌పై ప్రశ్నించిన సందర్భంలో పవన్ కళ్యాణ్ విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని, అది నాకు నచ్చలేదని, కావున తాను మాట్లాడుతున్నానని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. ప్రజలు పవన్‌ను మతపరంగా ప్రజలను విడదీసేందుకు లేదా విధ్వంసకర రాజకీయాలు చేయడానికి ఎన్నుకోలేదని అన్నారు.