తదుపరి వార్తా కథనం
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 21, 2025
03:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోల మార్ఫింగ్‌పై జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల కుంభమేళాలో పవన్ పవిత్ర స్నానం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి ప్రచారం జరుగుతున్నట్లు జనసేన వర్గాలు ఆరోపించాయి.
'జగనన్న సైన్యం' పేరుతో ఉన్న ఓ సోషల్ మీడియా ఖాతాలో పవన్ కళ్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకరంగా పెట్టారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన కార్యకర్తలు నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.