LOADING...
Pawan Kalyan: ఢిల్లీ బాట పట్టనున్న పవన్ కళ్యాణ్.. జనసేన విస్తరణపై కీలక సమావేశాలు!
ఢిల్లీ బాట పట్టనున్న పవన్ కళ్యాణ్.. జనసేన విస్తరణపై కీలక సమావేశాలు!

Pawan Kalyan: ఢిల్లీ బాట పట్టనున్న పవన్ కళ్యాణ్.. జనసేన విస్తరణపై కీలక సమావేశాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 14, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. పార్టీ విస్తరణతో పాటు జనసేన భావజాలాన్ని జాతీయ స్థాయిలో ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఢిల్లీలో జరిగే పలు కీలక సమావేశాలు, కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి మధ్యాహ్నం 3:45 గంటలకు పవన్ కళ్యాణ్ బయలుదేరుతారు. అనంతరం సాయంత్రం 4:25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 4:30 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ప్రయాణం ప్రారంభించనున్నారు. రాత్రి 6:40 గంటలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత నేరుగా తాజ్ హోటల్‌కు వెళ్లనున్నారు.

వివరాలు

ఐదు రాష్ట్రాల నేతలతో కీలక భేటీ

ఢిల్లీలో జనసేన పార్టీకి చెందిన ఐదు రాష్ట్రాల ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, వివిధ రాష్ట్రాల్లో జనసేన విస్తరణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఆయన కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.

వివరాలు

పార్టీ సిద్ధాంతాలపై వివరణ

ఈ పర్యటనలో భాగంగా ఇండియా గేట్ సమీపంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. 'సేన గళం' పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా జనసేన సిద్ధాంతాలు, పార్టీ లక్ష్యాలను దేశ ప్రజలకు వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయాల్లో జనసేన పాత్ర, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరి, భవిష్యత్ రాజకీయ దిశపై పవన్ కళ్యాణ్ ఈ వేదికగా కీలక సందేశం ఇవ్వనున్నట్లు అంచనా వేస్తున్నారు.

Advertisement