Page Loader
Pawan Kalyan: ఉపాధి హామీ పనుల నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు
ఉపాధి హామీ పనుల నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు

Pawan Kalyan: ఉపాధి హామీ పనుల నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2024
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉపాధి హామీ పనుల నాణ్యతపై రాజీ పడొద్దని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పనుల ప్రతి దశలో నాణ్యత ప్రమాణాలను నిర్ధారించడానికి అధికారులను ఆయన ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో కమిషనర్ కృష్ణతేజతో పాటు ఇతర అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో, ఉపాధి హామీ పథకం, ఆర్థిక సంఘం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆయన వెల్లడించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినట్లుగా పంచాయతీ నిధులను దారితప్పించకుండా ఉండాలని అధికారులను ఆదేశాలను జారీ చేశారు.