Pawan kalyan: పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి అభివృద్ధి చేయండి: అశ్వినీ వైష్ణవ్‌కు ఉపముఖ్యమంత్రి వినతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పిఠాపురంలోని రైల్‌భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. ఈ సమావేశంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అంశాలను, ముఖ్యంగా రైల్వే అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యతలను ఆయన ముందుకు తెచ్చారు. పవన్ కల్యాణ్ ముఖ్యంగా పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా కీలక పట్టణంగా ఉండడం, ఇక్కడ అష్టాదశ శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభస్వామి ఆలయాలున్న కారణంగా, భక్తులు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి మౌలిక వసతులు అందించడం అత్యవసరం అని తెలిపారు.
వివరాలు
రైల్వేమంత్రి సానుకూలంగా స్పందించారు: పవన్
అలాగే,సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకంలోకి తీసుకురావాలని, ఇది 2030 జాతీయ రైలు ప్రణాళికలో లెవెల్ క్రాసింగ్‌లను తొలగించడంలో, ట్రాఫిక్ నియంత్రణలో కీలకంగా సహకరిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. వీటితోపాటు, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఇతర రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా ఆయన రైల్వే మంత్రితో చర్చించారు. తాను చేసిన విజ్ఞప్తులన్నింటికీ రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. తన ప్రతిపాదనలన్నింటినీ రైల్వే మంత్రి పరిగణనలోకి తీసుకుంటారని, అన్ని అంశాలపై సానుకూల వాతావరణంలో చర్చ జరిగిందని తెలిపారు. కాకినాడ జిల్లాతోపాటు ఏపీ వ్యాప్తంగా రైల్వే అభివృద్ధికి ప్రోత్సాహకరమైన మద్దతు పలికినందుకు అశ్వినీవైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.