LOADING...
Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక
రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక

Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మహిళలపై విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యల్లో అమరావతిని అవమానించడమే కాక, ఆ ప్రాంత మహిళల గౌరవాన్ని దెబ్బతీశారని పవన్‌ మండిపడ్డారు. అమరావతిలో విలసిల్లిన బౌద్ధ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడటం బాధాకరం. ఆ ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను విస్మరించడమో, లేక తక్కువగా అంచనా వేయడమో తగదు. రాజధాని కోసం భూములు ఇచ్చినవారిలో 32 శాతం ఎస్సీ, ఎస్టీలు, 14 శాతం బీసీలు ఉన్నారు.

Details

కఠిన చర్యలు తీసుకోవాలి

వారి త్యాగాలను చిన్నచూపు చూస్తూ ఎవరూ మాట్లాడకూడదని పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. విశ్లేషకుడి ముసుగులో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల వెనుక ఏదో ఒక వ్యవస్థీకృత కుట్ర ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని పవన్‌ ఆరోపించారు. అమరావతిపై దుష్ప్రచారాలు చేసి, అక్కడి మహిళలను కించపరిచే ప్రయత్నాన్ని ఏ విధంగానూ సహించబోమన్నారు. ఇలాంటి ఘటనపై ప్రజలు, అధికార యంత్రాంగం లోతుగా విశ్లేషించాలని, ఇటువంటి కుట్రలు ఏమాత్రం చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.