
Pawan Kalyan: సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం.. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్‌కి వెళ్లనున్నారు.
అక్కడ ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలయ్యాడు.
మంటలు వ్యాపించడంతో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
అలాగే, గాలిలోకి కలిసిన పొగ శ్వాసనాళాల్లోకి వెళ్లడం వల్ల మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడు.
వెంటనే స్కూల్ సిబ్బంది అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో పవన్
ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీ నేతలు ఆయనకు పర్యటనను వాయిదా వేసుకుని వెంటనే సింగపూర్‌కు వెళ్లాలంటూ సూచించారు.
అయితే పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గిరిజనులతో ఇచ్చిన మాట నెరవేర్చిన తర్వాతే వెళ్లతానని తెలిపారు.
నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, వాటిని పూర్తి చేసిన అనంతరం సింగపూర్ బయలుదేరతానన్నారు.
ఆయన అల్లూరి సీతారామరాజు పర్యటన ముగిసిన వెంటనే సింగపూర్‌కు పయనమవుతున్నారు.