Pawan Khera: పవన్ ఖేరాకు షాక్.. ముందస్తు బెయిల్ నిరాకరణ
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు అస్సాంలో న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలింది. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ భార్యపై చేసిన వ్యాఖ్యల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చేసిన అభ్యర్థనను గౌహతి హైకోర్టు తిరస్కరించింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఖేరా, సీఎం భార్య రినికి భూయాన్ శర్మకు పలు పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపించారు. ఈ వివరాలను హిమంత బిశ్వశర్మ తన అఫిడవిట్‌లో వెల్లడించలేదని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను సీఎం ఖండించారు. ఈ నేపథ్యంలో రిణికి భూయాన్ శర్మ ఫిర్యాదు మేరకు గువాహటిలో ఖేరాపై కేసు నమోదైంది.
వివరాలు
ఆస్సాం కోర్టును ఆశ్రయించాలి
ఈ కేసులో భాగంగా తెలంగాణ హైకోర్టు గతంలో ఖేరాకు తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ వారం రోజులపాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది, తద్వారా ఆయన అస్సాంలో సంబంధిత కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇచ్చింది. అయితే అనంతరం భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యవహారంపై స్టే విధించి, బెయిల్ కోసం అస్సాం కోర్టునే ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఈనెల 21న ఇరుపక్షాల వాదనలు విన్న గువాహటి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా, తాజాగా ఖేరా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించింది.