వారాహి యాత్రకి ముందు జనసేనాని ధర్మ పరిరక్షణ యాగం
ఈ వార్తాకథనం ఏంటి
వారాహితో వాహనంతో ఈ నెల 14 నుంచి జనసేనాని ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. అయితే ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమాన్ని, ఆకాంక్షిస్తున్న జనసేన చీఫ్, మంగళగిరిలోని పార్టీ స్టేట్ ఆఫీసులో ఈ యాగాలను నిర్వహిస్తున్నారు.
మహాగణపతి పూజతో ప్రారంభమైన ఈ యాగాన్ని పవనే స్వయంగా అంకురార్పణ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం 6 గంటల 55 నిమిషాలకు పట్టు వస్త్రాల ధారణలో మెరిసిన పవన్, యాగశాలలో దీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలనే ఈ యాగాలను చేపట్టినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. తొలుత దేవతామూర్తులకు ప్రణతులు అర్పించిన అనంతరం యాగశాలలో ఐదుగురు దేవతా మూర్తులను ప్రతిష్టించారు.
DETAILS
పార్టీ ఆఫీసులోనే సంప్రదాయబద్దంగా యాగాం
స్థిరత్వం, స్థితప్రజ్ఞతలను ప్రసాదించే దేవత గణపతి, శత్రుత్వాన్ని నిరోధించే దేవత చండీమాత, అష్టైశ్వర్యాలను ప్రసాదించే శివపార్వతులు, సమస్త లోకానికి ఆయురారోగ్యాన్ని ప్రసాదించే, కనిపించే దైవం సూర్యుడు, కలియుగ మహాపురుషుడు శ్రీ మహావిష్ణువు ఈ యాగపీఠంపై ఆశీనులు కాగా వీరికి అభిముఖంగా యంత్ర స్థాపన జరిపించారు.
సోమనారం ఉదయం పూట యాగంతో ప్రారంభమై, మంగళవారం పానకాల లక్ష్మీ నరసింహాస్వామి హోమం జరుగుతుందని జనసేన పార్టీ వెల్లడించింది.
ఇందుకోసం ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్దంగా ఈ యాగాన్ని జరిపిస్తున్నారని పార్టీ స్పష్టం చేసింది.