తదుపరి వార్తా కథనం
Property Tax: త్వరగా చెల్లించండి.. 22 నుంచి స్పెషల్ పన్ను డ్రైవ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 21, 2025
04:37 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం పిటిపి (ప్రాపర్టీ టాక్స్ పరిష్కార) కార్యక్రమాన్ని ఫిబ్రవరి 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారమూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బేగంపేట్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య తెలిపారు.
శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్టాడారు.
ఆస్తిపన్ను సమస్యలు, పునఃసమీక్ష అభ్యర్థనలు, పన్ను సవరణలు, కోర్టు కేసులతో సంబంధించిన ఏవైనా సమస్యలను బేగంపేట్ జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో వెల్లడించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమం ఫిబ్రవరి 22, మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.